షాద్‌నగర్: నర్సంపేట మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల షాద్‌నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి మరియు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశాయి.

షాద్‌నగర్ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

పార్టీకి తీరని లోటు

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో మరియు బీఆర్ఎస్ పార్టీ బలోపేతంలో పెద్ది సుదర్శన్ రెడ్డి వహించిన పాత్ర మరచిపోలేనిదని కొనియాడారు. ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుంటూ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను పార్టీ శ్రేణులు నిరంతరం గుర్తుంచుకుంటాయని పేర్కొన్నారు. ఆయన హఠాన్మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నటరాజన్, మండల అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నె కవిత నారాయణ, కౌన్సిలర్లు వసంత శ్రీనివాస్, శారద శేఖర్, జయలక్ష్మి కిషోర్, గౌస్ జానీ, గోపాల్, ఎస్పీ శివ, సర్పంచ్ గీత వీరేశం, మాజీ కౌన్సిలర్లు వెంకట్రాం రెడ్డి, యుగంధర్, జూపల్లి శంకర్, కానుగు అంతయ్య, నంద కిషోర్, చిన్న యాదగిరి, నాయకులు నక్కల వెంకటేష్ గౌడ్, లంకాల రాఘవేందర్ రెడ్డి, మల్లేష్, భువనేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 31 Jul 2026 | 07:04 PM IST
Tags: