న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక మందగమనం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం అత్యంత స్థిరంగా, మెరుగ్గా ముందుకు సాగుతోందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరబ్ గార్గ్ ధీమా వ్యక్తం చేశారు. జాతీయ స్టాటిస్టిక్స్ దినోత్సవ సదస్సులో పాల్గొన్న ఆయన, దేశ ఆర్థిక గమనంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
గ్లోబల్ సంక్షోభంలోనూ స్థిరంగా భారత ఆర్థిక రంగం: కేంద్ర కార్యదర్శి సౌరభ్ గార్గ్
అంతర్జాతీయ పరిస్థితులు ఎంత అననుకూలంగా ఉన్నప్పటికీ, భారత ఆర్థిక రంగం మాత్రం అత్యంత మెరుగైన స్థితిలో ఉందని కేంద్ర గణాంకాల శాఖ కార్యదర్శి సౌరబ్ గార్గ్ స్పష్టం చేశారు. 2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని సాధించాలంటే నమ్మకమైన డేటా ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.

ఈ వార్తా చదవండి:తెలంగాణ పలుకు... ప్రజల గుండెచప్పుడు హైటీవీ వేదికపై
అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ భారత్ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రాబోయే 2047 నాటికి 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్) అనే సుదీర్ఘ లక్ష్యాన్ని మనం విజయవంతంగా చేరుకోవాలంటే.. ప్రభుత్వ విధానాల రూపకల్పనలోనూ, కీలక నిర్ణయాలు తీసుకోవడంలోనూ క్షేత్రస్థాయి నుండి వచ్చే 'విశ్వసనీయమైన గణాంక సమాచారం' (Reliable Data) అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుందని సౌరబ్ గార్గ్ స్పష్టం చేశారు.
Read latest Business News and Telugu News
Updated: 10 Jul 2026 | 12:46 PM IST

