హైదరాబాద్: దేశీయ మార్కెట్లో పసిడి ధరలు సోమవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా మార్కెట్లో బంగారానికి డిమాండ్ గట్టిగానే ఉన్నప్పటికీ, ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా పాత ధరలే కొనసాగుతున్నాయి. మరోవైపు వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాలు:
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ తాజా సమాచారం ప్రకారం.. సోమవారం ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ నగరాలలో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.1,46,720 వద్ద స్థిరంగా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,34,490 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,10,040 గా నమోదైంది. తెలంగాణలోని నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ నగరాలతో పాటు ఏపీలోని విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి ప్రాంతాలలోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.
మెట్రో నగరాల్లో పసిడి తీరు:
దేశంలోని ఇతర ప్రధాన నగరాలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ముంబై, బెంగళూరు, కోల్‌కతాలలో రూ.1,46,720 గా ఉండగా.. చెన్నైలో రూ.1,49,450, దేశ రాజధాని న్యూఢిల్లీలో రూ.1,46,870 వద్ద ట్రేడ్ అవుతోంది.
వెండి ధర స్వల్పంగా డౌన్:
బంగారం స్థిరంగా ఉన్నప్పటికీ, వెండి మాత్రం కొనుగోలుదారులకు స్వల్ప ఉపశమనం కలిగించింది. కిలో వెండిపై రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో కిలో వెండి ధర రూ.2,59,900 వద్ద కొనసాగుతోంది.
(గమనిక: అంతర్జాతీయ మార్కెట్ ఒడిదొడుకుల ప్రకారం బంగారం, వెండి ధరలు క్షణక్షణానికి మారుతుంటాయి. వినియోగదారులు కొనుగోలు చేసే సమయంలో స్థానిక మార్కెట్ ధరలను మరోసారి పరిశీలించుకోవాలి.)


