ఫిల్మ్ డెస్క్: గ్లోబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. లీక్డ్ పిక్స్‌తో నిన్నమొన్నటి వరకు వార్తల్లో నిలిచిన ఈ మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ వార్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ (Fauzi) అఫీషియల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ గురువారం అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్ సెన్సేషనల్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ సుమారు రూ. 700 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం డిసెంబర్ 3, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

దర్శకుడు హను రాఘవపూడి తన సోషల్ మీడియా వేదికగా ఈ అప్‌డేట్ ఇస్తూ.. "డిసెంబర్ 3, 2026న ఫౌజీ మార్చ్ ప్రారంభం కానుంది. ధైర్యం, గౌరవం, స్వేచ్ఛను నమ్మే ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోయే ఒక అద్భుతమైన కథను వెండితెరపై వీక్షించండి" అంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సహా మొత్తం ఆరు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ప్రభాస్ 'షర్ట్‌లెస్' పోస్టర్

రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు మేకర్స్ వదిలిన సరికొత్త పోస్టర్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ షర్ట్‌లెస్ లుక్‌లో, ఒంటి నిండా రక్తంతో తడిసిపోయి, యుద్ధ భూమిలో చేతిలో గన్ పట్టుకుని అత్యంత రౌద్రంగా కనిపిస్తున్నారు. హను రాఘవపూడి మార్క్ క్లాస్ ఎమోషన్స్‌తో పాటు ప్రభాస్ రేంజ్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఏ స్థాయిలో ఉండబోతున్నాయో ఈ ఒక్క పోస్టర్ స్పష్టం చేస్తోంది.

భారీ తారాగణం.. క్రేజీ లైనప్

ఈ పీరియాడిక్ మిలిటరీ డ్రామాలో ప్రభాస్ సరసన సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ అగ్ర నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద మరియు చైత్ర జె. ఆచార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'సీతా రామం' ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వార్ ఎపిక్‌గా నిలవనుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 16 Jul 2026 | 12:26 PM IST
Tags: