మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నవచైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుడి వద్ద ప్రతిష్టించిన లడ్డూ వేలం పాటను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ వేలం పాటకు గ్రామస్తులు, భక్తులు హాజరై అద్భుతమైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. వేలం పాట ప్రారంభమైనప్పటి నుంచి లడ్డూను దక్కించుకోవడానికి పలువురు గ్రామస్తులు పోటీపడటంతో కార్యక్రమం ఉత్కంఠభరితంగా కొనసాగింది.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ కుమారుడు బక్కని రవి మాదిగ వేలం పాటలో అత్యంత ఉత్సాహంగా పాల్గొని.. చివరి వరకు సాగిన హోరాహోరీ పోటీలో ఏకంగా రూ. 51,000 లకు లడ్డూను సొంతం చేసుకున్నారు. భారీ మొత్తానికి లడ్డూను కైవసం చేసుకున్న రవి మాదిగను గ్రామస్తులు, యువజన సంఘం సభ్యులు అభినందించారు. గ్రామంలో అందరూ ఐకమత్యంతో కలిసికట్టుగా ఇలాంటి సంప్రదాయ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో నవచైతన్య యువజన సంఘం సభ్యులు బడుసు ప్రవీణ్, బక్కని అశోక్, ఆశపల్లి శంకరయ్య, బక్కని సిద్దు, పెంజర్ల బబ్లు, గుండెపు మహేందర్, తిరుమలి అరవింద్, కొండని శివ, పెంజర్ల నరేష్, బడుసు చంద్రయ్య, బక్కని సుమన్, బక్కని శంకరయ్య, ఎర్ర నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 23 Sept 2026 | 05:46 PM IST
Tags: