అమనగల్లు: రంగారెడ్డి జిల్లా అమనగల్ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు, రామ్ రెడ్డి లయన్ ఐ హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న రామ్ రెడ్డి లయన్ విజన్‌లో ఏర్పాటు చేసిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని అమనగల్ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ దీపిక ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిరుపేద ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్న ఇలాంటి ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మానవ శరీరంలో నేత్రాలు బాగుంటేనే ఈ ప్రపంచంలోని అందమైన దృశ్యాలన్నింటినీ చూడగలమని, కళ్ళు లేని జీవితం అంధకారమయం అవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ కళ్ల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, నిత్యం శుభ్రత పాటించాలని సూచించారు.

అలాగే ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆమె కోరారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో చూపు మందగించిన వారికి కంటి పరీక్షలు నిర్వహించి, ఐఓఎల్ (IOL) ఆపరేషన్లు చేయించి వారికి తిరిగి చూపును ప్రసాదించడం గొప్ప మానవసేవ అని ఆమె కొనియాడారు. ఈ వైద్య శిబిరంలో కంటి వైద్యులు ఎం. చంద్రశేఖర్ మొత్తం 55 మందికి సమగ్రంగా కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో చూపు సమస్యలు ఉన్న 25 మందిని తదుపరి ఆపరేషన్ల నిమిత్తం రామ్ రెడ్డి లయన్ హాస్పిటల్‌కు తరలించినట్లు లయన్స్ క్లబ్ పీఆర్ పాషా తెలిపారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్లు జూలూరి రమేష్, నటరాజ్ యాదయ్య, కంటి వైద్యులు ఎం. చంద్రశేఖర్, క్లబ్ సభ్యులు కర్నాటి కొండల్ రెడ్డి, పీఆర్ పాషా, జూలూరి గోపాల్, ఆసుపత్రి సిబ్బంది శిరీష తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 21 Sept 2026 | 05:55 PM IST
Tags: