కేశంపేట: కేశంపేట మండల పరిధిలోని నిర్దవెళ్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న చాకలి ఐలమ్మ విగ్రహ నిర్మాణ పనుల నిమిత్తం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్ ఉదారత చాటుకున్నారు. విగ్రహ ఏర్పాటు కోసం సోమవారం ఆయన స్వయంగా రూ.65 వేల భారీ ఆర్థిక విరాళాన్ని నిర్వాహకులకు అందజేశారు.

ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. సమాజం కోసం, ప్రజల హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన చాకలి ఐలమ్మ సేవలు, ఆమె త్యాగాల స్ఫూర్తిని భావి తరాలు ఎప్పటికీ గుర్తుంచుకునేలా గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అత్యంత అభినందనీయమన్నారు. మహిళా సాధికారత సాధనలోను, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం చాకలి ఐలమ్మ చేసిన సాహసోపేతమైన పోరాటం నేటి యువతకు ఎంతో ఆదర్శప్రాయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఉమాపతి, ఉపాధ్యక్షుడు రమేష్ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ పల్లాటి సురేందర్, మండల యూత్ అధ్యక్షుడు తోట వెంకటేష్, వార్డు సభ్యులు తోట చెన్నయ్య, ఇతర నాయకులు నవీన్ కుమార్, జమాల్ ఖాన్, ప్రేమ్ కుమార్ గౌడ్, గుత్తి రంగయ్య, సిలువేరు మల్లయ్య, చాకలి జంగయ్య, బండ నిరంజన్, బోడ రాములు, పట్నం మహేందర్, పినమోని రాము, కొత్తపేట కుమార్, బడ్క శీను, ఎర్గమోని శ్రీశైలం, రజక సంఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 21 Sept 2026 | 04:58 PM IST
Tags: