షాద్‌నగర్: స్థానిక యువత క్రీడల్లో రాణించి, శరీర దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలని షాద్‌నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మినీ స్టేడియంలో స్థానిక క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ క్రికెట్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాట్ పట్టి కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు.

inline-img

గ్రామీణ ప్రాంతాల్లో దాగున్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్యే అన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో గేమ్‌ ఆడాలని క్రీడాకారులకు సూచించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడల్లో ప్రతిభ చాటి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు.

రూ. 70 వేల భారీ బహుమతి

స్థానిక క్రికెట్ క్లబ్ నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచే జట్టుకు మొదటి బహుమతిగా రూ. 70,000 నగదు పారితోషికం, అలాగే రన్నరప్‌గా నిలిచే జట్టుకు ద్వితీయ బహుమతిగా రూ. 30,000 నగదు అందజేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జట్లు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నాయని వెళ్లడించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూరి బసవేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ అందే మోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, సీనియర్ నాయకులు చెంది తిరుపతిరెడ్డి, ఆదివాసి కోఆర్డినేషన్ రఘునాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు విశ్వం, సర్పంచ్‌లు విస్తావాత్ రాజు, నీరు, పీఏసీఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జమ్రుద్ ఖాన్, శ్రీనివాస్ యాదవ్, కేకే కృష్ణ, ఎండి ఇబ్రహీం, రాష్ట్ర ఆదివాసి అధ్యక్షుడు శ్రీనివాస్, మండల అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, కౌన్సిలర్లు బచ్చల నరేష్, రాజు నాయక్, కొప్పునూరు ప్రవీణ్, ముబారక్ అలీ ఖాన్, సాదిక్, కళ్యాణ్, పెంటన్న, శ్రీశైలం, జమాల్పూర్ చందు, శ్రీశైలం, సుజీవన్, ఖదీర్, స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్లు కబీర్, చిన్న, ఎస్టీ సెల్ అధ్యక్షులు గణేష్ నాయక్, మేనేజ్మెంట్ వినోద్, మార్టిన్, గంగాపురి భరత్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

inline-img
Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 8 Oct 2026 | 01:20 PM IST
Tags: