షాద్‌నగర్, సెప్టెంబర్ 27: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ మరియు జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి షాద్‌నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి, బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, పద్మశాలి సంఘం నాయకులు, జేఏసీ నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు.

inline-img

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన గొప్ప వ్యక్తిత్వం కొండా లక్ష్మణ్ బాపూజీదని కొనియాడారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, కార్మికులు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఆయన సాగించిన పోరాటాలు అమోఘమైనవని, నేటి తరానికి అవి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఎల్బీ నగర్ టిమ్స్ ఆసుపత్రికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుపెట్టాలని భావిస్తున్నందుకు ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు ప్రసన్న, మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు, షాద్‌నగర్ తాలూకా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మూలే జనార్ధన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ త్రిప్పిశెట్టి కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు నలమోని శ్రీధర్, కన్వీనర్ నక్క బాలరాజు యాదవ్, ఏ నర్సీంలు, హెల్త్ మోటివేటర్ జక్కుల శ్రీనివాస్, ఆర్ఐ వెంకట్ రెడ్డి, వి. రామారావు, మందారం నరసింహులు, ట్రెజరర్ గోర్ల రాము, గడ్డం జంగయ్య, బాలస్వామి, బి. నర్సింహులు, చెంది తిరుపతిరెడ్డి, దంగు శ్రీనివాస్ యాదవ్, ఎం.డి ఇబ్రహీం, ముబారక్, దర్శన్, కౌన్సిలర్లు, జమార్పూర్ చందు, ఖదీర్, హాజిపల్లి సర్పంచ్ కుమార్, వార్డు మెంబర్ విష్ణు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

inline-img
Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 28 Sept 2026 | 01:08 AM IST
Tags: