కందుకూరు: మండల పరిధిలోని ముచ్చర్ల గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన ఊట్లపల్లిలో గ్రామీణాభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ముచ్చర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఊటు పద్మ మహేందర్ ఆధ్వర్యంలో, కేంద్ర నిధుల నుంచి పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రత్యేక సహకారంతో రూ. 5 లక్షల అంచనా వ్యయంతో ఈ అభివృద్ధి పనులను చేపట్టారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఊటు పద్మ మహేందర్ మాట్లాడుతూ.. ముచ్చర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి గ్రామంలోనూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామ సమగ్రాభివృద్ధిలో భాగంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం వంటి అత్యవసర పనులను దశలవారీగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఊట్లపల్లి గ్రామంలో నూతనంగా చేపట్టిన ఈ సీసీ రోడ్డు నిర్మాణంతో స్థానిక ప్రజలకు, ముఖ్యంగా వాహనదారులు, పాఠశాల విద్యార్థులకు రాకపోకల్లో ఎదురవుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని తెలిపారు. గ్రామానికి కేంద్ర నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులకు ఎంతో సహకరిస్తున్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో విలేజ్ సెక్రటరీ ఇంద్రసేన రెడ్డి, ఉపసర్పంచ్ తెరటీ రవి, మాజీ ఎంపీటీసీ బక్క మల్లేష్, మాజీ ఉపసర్పంచ్ రేపని రవీందర్, వార్డు సభ్యులు మాదారం పద్మ, కృష్ణ గౌడ్, శంకరి వెంకటేష్, బొర్రా చెన్నయ్య, బండ అనిత వెంకటేష్, కోటిగాని అశోక్, కమ్మరి నర్సింహ, సిద్ధిగారి పుణ్యాలు, శేఖర్తో పాటు గ్రామస్థులు శ్రీనివాస్ గౌడ్, దర్శన్, నరేష్, గణేష్, కారోబార్ మొయ్యరి యాదయ్య తదితరులు పాల్గొని పనులను ప్రారంభించారు.


