మాడ్గుల: మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో మూడవత్ సికిందర్ (23) అనే యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ వేణుగోపాలరావు వెల్లడించారు. నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం సూర్య తండాకు చెందిన మృతుడు సికిందర్ తన ద్విచక్ర వాహనంపై ఇర్విన్ గ్రామానికి వస్తున్నాడు. అదే సమయంలో ఇర్విన్ గ్రామానికి చెందిన పాలకూర్ల సత్తయ్య తన టీవీఎస్ వాహనంపై వెళ్తుండగా.. మార్గమధ్యంలో రెండు వాహనాలు ఎదురెదురుగా వేగంగా వచ్చి బలంగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సికిందర్‌ను వెంటనే అప్రమత్తమైన స్థానికులు 108 వాహనంలో చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేసరికి పరిస్థితి విషమించడంతో అతడు అప్పటికే మృతి చెందామని వైద్యులు నిర్ధారించారు. ఈ రోడ్డు ప్రమాద ఘటనపై మృతుని తాత రామచంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 6 Sept 2026 | 10:02 PM IST
Tags: