జాబ్స్ డెస్క్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రతిష్టాత్మకమైన ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ESE) 2027 నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖల్లో గ్రూప్-ఎ, గ్రూప్-బి పోస్టులను భర్తీ చేయడానికి ఈ ప్రకటన వెలువడింది. దీని ద్వారా మొత్తం 480 ఖాళీలను నాలుగు ప్రధాన విభాగాలుగా (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్) భర్తీ చేయనున్నారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, అక్టోబర్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
విభాగాలు, పోస్టుల వివరాలు
కేటగిరి-I (Civil Engineering): సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసెస్, సర్వే ఆఫ్ ఇండియా, బోర్డర్ రోడ్స్ ఇంజినీరింగ్, సెంట్రల్ వాటర్ ఇంజినీరింగ్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్.
కేటగిరీ-II (Mechanical Engineering): డిఫెన్స్ ఏరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్, బోర్డర్ రోడ్స్ ఇంజినీరింగ్, ఇండియన్ నేవల్ మెటీరియల్ మేనేజ్మెంట్, ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్, సర్వే ఆఫ్ ఇండియా.
కేటగిరీ-III (Electrical Engineering): ఇండియన్ నేవల్ మెటీరియల్ మేనేజ్మెంట్, డిఫెన్స్ ఏరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్, సెంట్రల్ పవర్ ఇంజినీరింగ్, ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్.
కేటగిరీ-IV (Electronics & Telecommunication): ఇండియన్ టెలీకమ్యూనికేషన్, ఇండియన్ నేవల్ మెటీరియల్ మేనేజ్మెంట్, డిఫెన్స్ ఏరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్, ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్, ఇండియన్ రేడియో రెగ్యులేటరీ, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్.
ఈ వార్తా చదవండి:హ్యాపీ జర్నీ మూవీ రివ్యూ
అర్హతలు
పోస్టును బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ (BE / B.Tech) లేదా తత్సమాన అర్హత (ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ పరీక్షలు, ఏరోనాటికల్ సొసైటీ మెంబర్షిప్, లేదా సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ) కలిగి ఉండాలి.
వయోపరిమితి
జనవరి 1, 2027 నాటికి అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు
అభ్యర్థులు ఆన్లైన్లో రూ. 200 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం, పరీక్ష కేంద్రాలు
స్టేజ్-1: ప్రిలిమినరీ పరీక్ష (పేపర్-1: 200 మార్కులు, పేపర్-2: 300 మార్కులు)
స్టేజ్-2: మెయిన్స్ పరీక్ష (పేపర్-1: 300 మార్కులు, పేపర్-2: 300 మార్కులు)
స్టేజ్-3: పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ), మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థుల సౌలభ్యం కోసం ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలను హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలలో ఏర్పాటు చేయనున్నారు. మెయిన్ పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, విశాఖపట్నంలో అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్


