అమనగల్లు: 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా అమనగల్ మండలం అమనగల్లు ప్రభుత్వ హాస్పిటల్ హోమియోపతి శాఖ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు శివాలయం నగర్ శివశక్తి యూత్ అసోసియేషన్ గణేష్ నవరాత్రి ఉత్సవాల మండపం వద్ద ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక కౌన్సిలర్ ఎంగలి భాగ్యలక్ష్మి రఘు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ దొంతు శ్రీకాంత్ ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన హోమియోపతి మందులను పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరానికి స్థానిక ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. దాదాపు 82 మందికి పైగా ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకుని లబ్ధి పొందారు. వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణకు ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధ వహించాలని డాక్టర్ శ్రీకాంత్ ఈ సందర్భంగా సూచించారు. అనంతరం శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య బృందం డాక్టర్ శ్రీకాంత్, ఫార్మసిస్ట్ సత్యను ఘనంగా శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఎంగలి తరుణ్, ఎంగలి యాదగిరి, యోగ ఇన్స్పెక్టర్లు ఉమాపతిగౌడ్, లక్ష్మి, కోట్ల వెంకటేష్, నవీన్ కుమార్, తరుణ్ నాయక్, గుద్దేటి శివ, అరుణ్ నాయక్, గజ్జ మల్లేష్ గౌడ్, జల్ద అక్షయ్, సందర్శగౌడ్, జల్ద ఆకాష్, ఎంగలి శ్రీధర్, గుద్దేటి మహేష్, గజ్జ నరసింహ, గుర్రం కన్న, కోట్ల గౌతమ్, గజ్జ మనోజ్ గౌడ్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 21 Sept 2026 | 05:47 PM IST
Tags: