వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పరిగి మండలం గడిసింగపూర్ సమీపంలోని చింతల చెరువు వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఖాజా బీ (65), జహంగీర్ బీ (78) అక్కడికక్కడే మృతిచెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు కారులో ప్రయాణిస్తున్నారు. అబ్దుల్ హై అనే వ్యక్తి తన కారులో మరో ముగ్గురికి లిఫ్ట్ ఇచ్చి ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారులో ఉన్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 30 Aug 2026 | 10:59 PM IST
Tags: