ఫరూక్‌నగర్: నిరుపేద ఇంట జరిగే వివాహాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఫరూక్‌నగర్ మండలం పీర్లగూడ గ్రామ సర్పంచ్ శామీమ్ బేగం ముందుకు వచ్చి తన గొప్ప మనసు చాటుకున్నారు. గ్రామంలో ఏ ఇంట్లో ఆడపడుచు పెళ్లి జరిగినా వారికి సొంత ఖర్చులతో రూ. 10,000 అందజేసే కార్యక్రమాన్ని ఆమె కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా గడచిన 8 నెలల్లో ఇది ఐదవ సాయం కావడం విశేషం.

సమీపంలోనే గ్రామానికి చెందిన గుంటి మల్లయ్య, మంగమ్మ కూతురి వివాహం ఈనెల 30వ తేదీన నిశ్చయమైంది. ఈ వివాహ నిమిత్తం సర్పంచ్ శామీమ్ బేగం తన వంతు సహాయంగా తన భర్త కీర్తిశేషులు అజ్మీర్ ఘోరి పేరు మీద రూ. 10,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సాయం అందుకున్న గుంటి మల్లయ్య, మంగమ్మ కుటుంబ సభ్యులు సర్పంచ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై కూడా ప్రతి పేద ఇంటి బిడ్డ వివాహానికి తమ సొంతంగా రూ. పదివేల సాయం అందిస్తామని సర్పంచ్ శామీమ్ బేగం కుమారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవాజ్ ఘోరి, ఖాదర్ ఘోరి, చిక్కల సిద్దయ్య, లింగమయ్యతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 30 Aug 2026 | 10:27 PM IST
Tags: