వాంకిడి: బాల్యవివాహాల నిర్మూలనలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని డీసీపీవో బూర్ల మహేష్ పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (కేజీబీవీ) ఉపాధ్యాయులకు బాల్యవివాహాల నిర్మూలన అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు కేవలం విద్యాబోధన మాత్రమే కాకుండా విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం, భద్రత మరియు ఉజ్వల భవిష్యత్ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

బాల్యవివాహం వల్ల బాలికల విద్యకు తీవ్ర ఆటంకం కలగడమే కాకుండా వారి ఆరోగ్యం, మానసిక స్థితి, భవిష్యత్ అవకాశాలు, సామాజిక భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో బాల్యవివాహాల పూర్తిగా నివారించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డీపీసీయూ ప్రొటెక్షన్ అధికారి శ్రావణ్‌కుమార్, చైల్డ్‌హెల్ప్‌లైన్ సూపర్‌వైజర్ పీతాంబర్, ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ బండి సంతోష్ కుమార్, ఎంఈవో వివచరణ్‌కుమార్, కేజీబీవీ ఎస్‌వో రైసా ఖాతూన్ తో పాటు పలువురు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 6 Sept 2026 | 12:00 AM IST
Tags: