నాగర్‌కర్నూల్: ఈనెల 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ న్యాయాధికారి డి. రమాకాంత్ కోరారు. జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. వివిధ రకాల కేసుల్లో పెండింగ్‌లో ఉన్న వాటిని రాజీ మార్గంలో పరిష్కరించుకునేందుకు ఇది మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించుకుంటే ఇరువురికీ సత్వర న్యాయం లభించినట్టేనని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ప్రత్యేక సెషన్స్ న్యాయాధికారి నసీం సుల్తానా మాట్లాడుతూ.. లోక్‌అదాలత్‌లో క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలకు సంబంధించిన కేసులను రాజీపడి పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో ప్రత్యేక సెషన్స్ న్యాయాధికారి నసీం సుల్తానా, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ నిహారిక, సీనియర్ సివిల్ న్యాయాధికారి గోపిక నాగ శ్రావ్య, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి శృతి ధూత తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 5 Sept 2026 | 11:57 PM IST
Tags: