ఎల్బీనగర్: రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (డీఎంహెచ్‌వో) డాక్టర్ స్వర్ణకుమారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఎల్బీనగర్ పరిధిలో సరైన లైసెన్స్ లేదంటూ అధికారులు గతంలో మూసివేసిన ఓ ఫిజియోథెరపీ ఆస్పత్రిని తిరిగి తెరవడానికి ఆమె రూ. 2 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడి నుంచి ఏసీబీకి ఫిర్యాదు అందినట్లు తెలిసింది.

ఈ డిమాండ్‌లో భాగంగా తొలుత రూ. లక్ష ఇవ్వాలని డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి కోరినట్లు బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో వల పన్నారు. బాధితుడు ఆ రూ. లక్ష నగదును హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌కు అందజేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ ఉదంతానికి సంబంధించి పూర్తి వివరాలు, తదుపరి సోదాలు కొనసాగుతున్నాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 5 Oct 2026 | 08:36 PM IST
Tags: