గన్నేరువరం: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన రంగనవేని వీరయ్య గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ముదిరాజ్ సంఘం నాయకులు, కుల పెద్దలు ఘనంగా సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు.
పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీలో నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, మండల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గన్నేరువరం గ్రామ సర్పంచ్ రంగనవేణి లచ్చినర్సు, గన్నేరువరం మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బోయింది మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాకాల పర్షరాములు, కూన కొమురయ్యతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు, ముదిరాజ్ కుల పెద్దలు పాల్గొన్నారు.


