వనస్థలిపురం: తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్పర్సన్గా ప్రజాభవన్లో బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మిని వనస్థలిపురం డివిజన్ మాజీ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి గారు పూల బొకేతో కలిసి హృదయపూర్వకంగా అభినందించారు.
ఈ సందర్భంగా విజయలక్ష్మి గారి పదవీకాలం విజయవంతంగా, ప్రజలకు మరింత ఉపయోగకరంగా సాగాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆమె సేవలు మరింతగా దోహదపడాలని రాగుల వెంకటేశ్వర్ రెడ్డి మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.


