తలకొండపల్లి: అంత్యోదయ, ఏకాత్మ మానవతావాద సిద్ధాంతాలు సమాజానికి ఎప్పటికీ ఆదర్శప్రాయమని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు నీలకంఠం పాండు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ‘అంత్యోదయ’ భావన ద్వారా సమాజంలో అత్యంత వెనుకబడిన, అట్టడుగున ఉన్న చివరి వ్యక్తి అభివృద్ధి చెందేలా కృషి చేయడమే నిజమైన ప్రజాసేవ అని కొనియాడారు. భారతీయ సంస్కృతికి అనుగుణంగా ఆయన అందించిన ఏకాత్మ మానవతావాద సిద్ధాంతం దేశ రాజకీయ, సామాజిక వ్యవస్థకు బలమైన పునాది వేసిందని గుర్తుచేశారు. మహనీయుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ చూపిన ఆశయాలు, మార్గదర్శకాలను ప్రతి కార్యకర్త ఆచరణలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పెరుమాళ్ల రాజు, మాజీ ఉపసర్పంచ్, బీజేవైఎం నాయకులు పద్మ అనిల్ ముదిరాజ్, బండి యాదయ్య, బొల్లా శ్రీను, సిద్ధయ్య, డాక్టర్ ప్రసాద్, తిరుమని గణేష్ గౌడ్, ఈసరి బాలకృష్ణ, కటుమల విజయ్ కుమార్, ఇస్లావత్ వెంకటేష్ నాయక్, కృష్ణ, మహేందర్, సురేష్, పరమేష్, రాము, కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


