కేశంపేట: కేశంపేట మండలంలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. శ్రీరుద్ర ఆర్యనాథన్ గో సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో, గురుస్వామి సత్యనారాయణ రెడ్డి నేతృత్వంలో షాద్‌నగర్ ప్రాంతం నుంచి వచ్చే నెల అక్టోబర్ 12వ తేదీన శబరిమలకు మహా పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ పవిత్ర పాదయాత్రలో మొత్తం 100 మంది అయ్యప్ప స్వాములు సుమారు 37 రోజుల పాటు కాలిబాకన శబరిమలకు మహా పాదయాత్రను చేపట్టనున్నారు.

ఈ యాత్రలో పాల్గొనే భక్తులకు వంటావార్పు కోసం అత్యవసరంగా కావలసిన వంట పాత్రల కొనుగోలు నిమిత్తం.. ప్రముఖ పల్లె బ్రదర్స్‌లో ఒకరైన పల్లె బాలేశ్వర్ ముందుకు వచ్చారు. బుధవారం ఆయన స్వయంగా స్పందించి రూ. 1,10,000 (లక్షా పది వేల రూపాయల) భారీ ఆర్థిక సహాయాన్ని నిర్వాహకులకు విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా పల్లె బాలేశ్వర్ మాట్లాడుతూ.. ఇలాంటి మహత్తరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సాధ్యమైన రీతిలో ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అయ్యప్ప స్వాముల దీవెనలు, భగవంతుడి కృప అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. తమ పాదయాత్ర విజయవంతం కావడానికి ఉదారతతో ఆర్థిక సహాయం అందించిన పల్లె బ్రదర్స్‌కు శ్రీరుద్ర ఆర్యనాథన్ గోసేవా ట్రస్ట్ నిర్వాహకులు, అయ్యప్ప స్వాములు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 23 Sept 2026 | 07:54 PM IST
Tags: