నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో వినాయక చవితి నిమజ్జనోత్సవాలు అత్యంత వైభవంగా, వినూత్న రీతిలో సాగాయి. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో రెబల్ యూత్ ఆధ్వర్యంలో నవరాత్రులు పూజలందుకున్న గణనాథుని నిమజ్జన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఆధునిక ధూమ్ ధామ్ శైలికి భిన్నంగా, పూర్తిగా సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేకంగా అలంకరించిన ఎద్దుల బండిపై గణనాథుడిని కొలువుదీర్చి శోభాయాత్ర నిర్వహించారు.

ఈ నిమజ్జన కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు భారీ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎద్దుల బండిపై స్వామివారిని ఊరేగిస్తూ సాగిన ఈ యాత్ర స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ, 'గణపతి బప్పా మోరియా' నామస్మరణతో పరిసరాలను మార్మోగించారు. నాగర్‌కర్నూల్ చరిత్రలోనే ఎంతో వినూత్న రీతిలో, పర్యావరణ స్పృహను చాటేలా ఈ నిమజ్జన కార్యక్రమం నిర్వహించారని పలువురు ప్రశంసించారు. చివరకు భక్తులు అందరూ కలిసి ఎంతో భావోద్వేగంతో, ఉత్సాహంగా గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చి ఘనంగా వీడ్కోలు పలికారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 25 Sept 2026 | 09:40 PM IST
Tags: