తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన గాజులపల్లి సత్యమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. సత్యమ్మ మృతి గ్రామంలో విషాదం నింపింది. ఈ విషయం తెలుసుకున్న పడకల్ సర్పంచ్ డోకూరు సునీత ప్రభాకర్ రెడ్డి శుక్రవారం స్వయంగా మృతురాలి నివాసానికి వెళ్లి ఆమె కుటుంబాన్ని పరామర్శించారు.
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో కుటుంబానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, ఆపద సమయంలో అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్పంచ్ భర్త డోకూరి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామపంచాయతీ, స్థానిక ప్రజాప్రతినిధుల తరఫున అంత్యక్రియల నిమిత్తం తక్షణ సహాయంగా రూ. 4,000 ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు ఎండీ వాజిత్, బి. నరసింహ, బి. రమేష్, తుళ్ల తిరుపతిగౌడ్, బండగళ్ల రామస్వామి, బత్తుల లక్ష్మీనారాయణ, ఎండీ బషీర్, ఎండీ గౌస్, సత్తయ్య, నరసింహ తదితరులు పాల్గొని సత్యమ్మ భౌతికకాయానికి నివాళులర్పించారు.


