గజ్వేల్: గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు ముట్రాజ్ పల్లిలో భక్తిశ్రద్ధలతో నల్ల పోచమ్మ, దుర్గమ్మ అమ్మవార్ల బోనాల వేడుకలను నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. అమ్మవార్ల విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, పసుపు-కుంకుమలు సమర్పించి ప్రజలందరూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.

స్థానిక ప్రజల ఆహ్వానం మేరకు విచ్చేసిన ఎంపీ రఘునందన్ రావుకు స్వాగతం పలికారు. బోనాల పండుగను పురస్కరించుకుని ముట్రాజ్ పల్లి పండుగ వాతావరణంతో కళకళలాడింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 6 Sept 2026 | 05:41 PM IST
Tags: