వనస్థలిపురం: క్రీడాకారుల భవిష్యత్తుకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎల్‌.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి భరోసా ఇచ్చారు. వనస్థలిపురం స్కేటింగ్ రింక్‌కు చెందిన రోలర్ హాకీ, ఇన్‌లైన్ హాకీ క్రీడాకారుల తల్లిదండ్రులు ఎల్‌.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారిని కలిసి తెలంగాణ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ల అఫిలియేషన్ సమస్యను వివరించారు. రెండు అసోసియేషన్లకు ఎస్ఏటీ (SAT) అఫిలియేషన్ నిలిచిపోవడంతో జాతీయ స్థాయి ఎంపికలు ఆలస్యం అవుతున్నాయని, దీనివల్ల తమ పిల్లల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతోందని తల్లిదండ్రులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సమస్యపై అత్యంత సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. ఈ అంశంపై క్రీడల శాఖ మంత్రితో మాట్లాడి, రెండు అసోసియేషన్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ అసోసియేషన్లు ఏకతాటిపైకి రాకపోయినా, రాబోయే 64వ జాతీయ స్థాయి పోటీలకు క్రీడాకారులకు ఎలాంటి నష్టం జరగకుండా ఎస్ఏటీ (SAT) ఆధ్వర్యంలో నేరుగా ట్రయల్స్ నిర్వహించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని ధైర్యం చెప్పారు. “క్రీడాకారుల భవిష్యత్తే నా మొదటి ప్రాధాన్యత” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా తమ సమస్యపై స్పందించి భరోసా కల్పించిన రోలర్ & ఇన్‌లైన్ హాకీ క్రీడాకారుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టంగుటూరి నాగరాజు, కిరణ్ కుమార్, సునీల్, శివ, నరేష్, హరీష్, బాలరాజు, మధు, హరి, చందన్, శరత్, రాఘవేంద్ర, సీనియర్ ప్లేయర్లు ముస్తఫా, అహ్మద్, శివం, సౌరవ్ మాలిక్, సంతోష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 7 Sept 2026 | 10:11 PM IST
Tags: