కొల్లాపూర్: కొల్లాపూర్ మండల పరిధిలోని అంకిరావుపల్లి, సింగోటం గ్రామాల పరిధిలో ఇందిరా మహిళా శక్తి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న రెండు 800 కిలోవాట్ల (11 కేవీ) సోలార్ యూనిట్ల నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రులు డాక్టర్ సీతక్క, జూపల్లి కృష్ణారావు, నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్లతో కలిసి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.
మహిళా సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ సోలార్ యూనిట్ల ద్వారా మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడంతో పాటు, స్వయం ఉపాధి, ఆదాయ మార్గాలను పెంపొందించేలా, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక సాధికారతకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని మంత్రులు తెలిపారు. అంతకుముందు అంకిరావుపల్లి గ్రామంలో రూ. 17.78 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న హ్యామ్ (HAM) రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రులు, ఎంపీ, జిల్లా కలెక్టర్ శంకుస్థాపన చేశారు.


