షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట, కాంగ్రెస్ పార్టీ, జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి షాద్‌నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, పద్మశాలి సంఘం నాయకులు, జేఏసీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొని బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

inline-img

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన గొప్ప వ్యక్తిత్వం కొండా లక్ష్మణ్ బాపూజీదని కొనియాడారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, కార్మికులు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఆయన సాగించిన పోరాటాలు అమోఘమైనవని, నేటి తరానికి అవి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నిమ్స్ ఆసుపత్రికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం పట్ల ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

inline-img

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వం, షాద్‌నగర్ తాలూకా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మూలే జనార్ధన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ త్రిప్పిశెట్టి కరుణాకర్, కన్వీనర్ నక్క బాల్ రాజ్ యాదవ్, హెల్త్ మోటివేటర్ జక్కుల శ్రీనివాస్, ఆర్ఐ వెంకట్ రెడ్డి, వి. రామారావు, మందారం నరసింహులు, ట్రెజరర్ గోర్ల రాము, గడ్డం జంగయ్య, బాలస్వామి, బి. నర్సింలుతో పాటు కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు నలమోని శ్రీధర్, చెంది తిరుపతిరెడ్డి, ఇబ్రహీం, ముబారక్, దర్శన్, కౌన్సిలర్లు బచ్చలి నరేష్, జమాల్పూర్ చందు, ఖదీర్, హాజిపల్లి సర్పంచ్ కుమార్, వార్డు మెంబర్ విష్ణు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 21 Sept 2026 | 10:37 AM IST
Tags: