తుర్కయంజాల్: ఆదిభట్ల సర్కిల్ తుర్కయంజాల్ డివిజన్ పరిధిలోని ప్రముఖ్ టౌన్షిప్లో పార్కు స్థలాన్ని కాపాడాలని కోరుతూ ప్రముఖ్ టౌన్షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. టౌన్షిప్లోని సుమారు 3 ఎకరాల 14 గుంటల పార్కు స్థలాన్ని పరిరక్షించాలని వారు హైడ్రా అధికారులను కోరారు. ఫిర్యాదుపై వెంటనే స్పందించిన హైడ్రా సీఐ సైదులు ఆ స్థలాన్ని పరిశీలించి, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు.
అనంతరం హైడ్రా సిబ్బందితో కలిసి ఆ పార్కు స్థలంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. పార్కు స్థలం అన్యాక్రాంతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవడంతో టౌన్షిప్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. పార్కు స్థల పరిరక్షణకు స్పందించి సత్వర చర్యలు చేపట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ అలాగే సీఐ సైదులుకు ప్రముఖ్ టౌన్షిప్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ్ టౌన్షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చెన్నారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మల్లా రెడ్డి, జాయింట్ సెక్రటరీ రాజ శేఖర్ రెడ్డి, కల్చరల్ సెక్రటరీ రామ్ రెడ్డి, చీఫ్ అడ్వెసర్ సురేందర్ రెడ్డి, రఘు రామయ్యతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.


