షాద్‌నగర్: షాద్‌నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై ప్రత్యేక సన్నాహక సమావేశం నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లమోని శ్రీధర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పట్టభద్రుల ఓటరు నమోదును విస్తృతంగా చేపట్టడంపై కూలంకషంగా చర్చించారు. ఈ సమావేశానికి షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్ ముదిరాజ్, గిరిజన ఆదివాసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ రఘు నాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులందరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని నాయకులు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో ప్రాధాన్యతనిచ్చారు. ప్రణాళికాబద్ధంగా వార్డులవారీగా పర్యటిస్తూ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు ఇన్‌చార్జీలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య శ్రేణులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 14 Oct 2026 | 09:14 PM IST
Tags: