కొల్లాపూర్: నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి బీరం లక్ష్మారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
బీరం లక్ష్మారెడ్డి మృతితో హర్షవర్ధన్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లక్ష్మారెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బీరం లక్ష్మారెడ్డి అంత్యక్రియలను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నాగర్కర్నూల్ జిల్లా సింగోటంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ అంతిమయాత్రలో పలువురు రాజకీయ నేతలు, స్థానికులు పాల్గొని ఆయనకు నివాళులు అర్పించనున్నారు.


