మాడ్గుల: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నాగిళ్ల గ్రామానికి చెందిన చాట్ల పోచమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని నాగిళ్ల గ్రామ సర్పంచ్ పాలకూర్ల సంతోష రాజు గౌడ్ ద్వారా తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తక్షణమే స్పందించారు. మృతిరాలి కుటుంబ పరిస్థితిని తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపం తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయి కష్టకాలంలో ఉన్న బాధిత కుటుంబానికి అండగా నిలవడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో మృతురాలి కుటుంబానికి వ్యక్తిగతంగా రూ. 5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల తరఫున ఆ కుటుంబానికి తగిన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సత్తయ్య, బీఆర్ఎస్ (BRS) సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ సురమల సత్తయ్య, బండ నరసింహ, నాగిళ్ల మహేష్, పల్లెటూరు చంద్రయ్య, నేమురి యాదయ్య, వార్డు సభ్యులు చాట్ల లక్ష్మి, శ్రీశైలం తదితరులు పాల్గొని మృతురాలికి నివాళులర్పించారు.


