షాద్‌నగర్: షాద్‌నగర్ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్‌ను రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను సాదరంగా అభినందించి, హరిత స్ఫూర్తిని చాటేలా మొక్కను జ్ఞాపికగా బహుకరించారు.

ఈ భేటీలో భాగంగా ఎక్సైజ్ శాఖకు సంబంధించిన పలు అంశాలు, శాఖాపరమైన విధులకు సంబంధించి ఎమ్మెల్యే శంకర్‌తో అధికారులు చర్చించారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) వెంకట్ రెడ్డితో పాటు ఎక్సైజ్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 7 Oct 2026 | 09:48 PM IST
Tags: