షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలో అక్రమంగా జింక మాంసాన్ని తరలిస్తున్న వేటగాళ్ల ముఠాను ఎస్‌వోటీ (SOT) పోలీసులు సోమవారం అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు షాద్‌నగర్ టోల్‌ప్లాజా వద్ద ఎస్‌వోటీ పోలీసులు విస్తృత వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కారులో అక్రమంగా తరలిస్తున్న 13 కిలోల జింక మాంసాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

inline-img

ఈ అక్రమ వేటకు ఉపయోగించిన ఒక రైఫిల్, రెండు కార్లను పోలీసులు జప్తు చేయడంతో పాటు, మొత్తం ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను, స్వాధీనం చేసుకున్న జింక మాంసం, రైఫిల్, వాహనాలను కొత్తూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం వాటిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ కేసును అటవీ శాఖ ఉన్నతాధికారి స్టీవా ఆశిష్ పర్యవేక్షణలో అటవీ అధికారులు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 28 Sept 2026 | 11:04 AM IST
Tags: