మియాపూర్: శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మియాపూర్‌ వైశాలి నగర్‌లో జైన్ సమాజం ఆధ్వర్యంలో భారతదేశంలోనే మొట్టమొదటి ‘అహింసా స్తంభం’ ఆవిష్కరణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ చారిత్రక కార్యక్రమంలో కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డితో పాటు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

భగవాన్ మహావీరుడు ప్రపంచ మానవాళికి అందించిన అహింస, శాంతి, జీవకారుణ్యం వంటి మహోన్నత సందేశాలను నలుదిశలా చాటిచెప్పేలా ఈ అహింసా స్తంభాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని నేతలు కొనియాడారు. భారతీయ సనాతన సంస్కృతిలోని శాంతి, సహనం, మానవతా విలువలను భావితరాలకు సతతం గుర్తుచేసే ఈ పవిత్ర స్తంభం మహానగరం హైదరాబాద్‌కు మరింత ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ అహింసా మార్గంలో నడుస్తూ శాంతి, సౌభ్రాతృత్వాలతో ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 6 Sept 2026 | 09:13 PM IST
Tags: