నాగోల్: నాగోల్ డివిజన్ పరిధిలోని సహభావన ఏ బ్లాక్‌లో స్థానిక ప్రజల కోసం నూతనంగా నిర్మించిన ఓపెన్ జిమ్‌ను ఎల్‌బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కాలనీలలో అవసరమైన మౌలిక వసతులతో పాటు వ్యాయామ సదుపాయాలను కూడా పెద్దపీట వేసి అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ శారీరక దారుఢ్యాన్ని కాపాడుకోవాలని, కాలనీవాసులు ఈ ఓపెన్ జిమ్‌ను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఆయన సూచించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చింతల సురేందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు తూర్పాటి చిరంజీవి, విశ్వేశ్వర్ తదితర నాయకులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 6 Sept 2026 | 09:07 PM IST
Tags: