తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామ అభివృద్ధికీ ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరుతూ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్ వ్యవస్థతో పాటు వీధిలైట్ల (ఐమాక్స్ లైట్లు) ఏర్పాటుకు నిధులు కేటాయించాలని కోరారు.

ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నాయకులకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ చర్ల వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు జి. శ్రీనివాసమూర్తి, ఎం. అంబాజీ, మాజీ సింగిల్ విండో చైర్మన్ ఎ. అంజయ్య గౌడ్, మాజీ ఉప సర్పంచ్‌లు బి. నరసింహులు, అజిజ్, నాయకులు పి. అశోక్ బాబు, ఎ. వెంకట్ రెడ్డి, మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండీ ఆరిఫ్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ టి. కృష్ణయ్య గౌడ్, వద్దే రాజు, పులిజాల విష్ణు, ఇ. రాఘవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 7 Oct 2026 | 10:12 PM IST
Tags: