ఆమనగల్లు: మండల కేంద్రానికి ఏసీపీ కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరు కావడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చిత్రపటాలకు ఘనంగా పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక చొరవతో ఆమనగల్లుకు ఏసీపీ కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరు కావడం ప్రాంత ప్రజల చిరకాల స్వప్న సాకారమన్నారు. ఇందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ఎంపీ మల్లు రవికి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి ఆమనగల్లు ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పరిపాలనా సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఆమనగల్లుకు ఈ కార్యాలయాలు రావడంతో స్థానికులకు పోలీసు సేవలు మరింత చేరువ కానున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు అవ్వారి శివలింగం, కౌన్సిలర్ అనిత శ్రీనివాస్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఖాదర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి రఘురాములు, మార్కెట్ డైరెక్టర్ వాస్పుల శ్రీశైలం, ఆదివాసీ కోఆర్డినేటర్ కృష్ణ నాయక్, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎంగలి ప్రసాద్, ఎంపీపీ విజయ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వస్పుల శ్రీకాంత్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ ఫరీద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండల్‌రెడ్డి, వగ్గు మహేష్, మల్లేష్ నాయక్, ఉప్ప సర్పంచ్ విజయ్ నాయక్, అమర్‌సింగ్, గాజుల శ్రీను, బాబా, అలీం, సురేష్, నాసర్, రాఘవేందర్, రహీం, కృష్ణ యాదవ్, కండె సాయి, రాజు, మహేష్, కరీం, గౌస్, రఫీ, శివ, హరిలాల్, పరమేష్, నర్సింహ, గోపాల్, మైసయ్య, అంజాద్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 7 Oct 2026 | 10:03 PM IST
Tags: