గన్నేరువరం: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చాకలివానిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రేపాక బానవ్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సర్పంచ్ రేపాక బానవ్వ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో దొరల అణచివేత, దోపిడీ, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ సాహసోపేతంగా చేసిన పోరాటం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భూమి, భుక్తి, ఆత్మగౌరవం కోసం ఆమె ధైర్యంగా నిలబడిన తీరు ప్రశంసనీయమన్నారు. ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా బడుగు, బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇట్టం రాజు, నక్క మల్లయ్య, కోడూరి బాబు, బామండ్ల ఆనంద్, రేపాక బాబు, గ్రామస్థులు తదితరులు పాల్గొని వీరనారి ఐలమ్మకు నివాళులర్పించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 26 Sept 2026 | 05:55 PM IST
Tags: