కొత్తపేట: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారె, ఇతర నాయకుల పట్ల అధికార కాంగ్రెస్ పార్టీ సూచనలతో పోలీస్ అధికారులు ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యానికే మచ్చలాంటిదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈ అణచివేత ధోరణిని తీవ్రంగా ఖండిస్తూ ఆర్కేపురం, సరూర్ నగర్ డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొత్తపేట చౌరస్తా వద్ద భారీ ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, అరాచక వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని సరూర్ నగర్, చైతన్యపురి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ, సాజీద్, గొడుగు శ్రీనివాస్, న్యాలకొండ శ్రీనివాస్ రెడ్డి, షేర్ రామన్, శ్రీనివాస్ గౌడ్, ప్రత్యూష్, సునీల్, గుఫ్రానుద్దీన్, రాజు యాదవ్, పెంబర్తి శ్రీసు, కిరణ్, సంతోష్, నిరంజన్, సాయి, గణేష్ గౌడ్, జగన్, శంకర్ తదితరులు పాల్గొని ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.


