బడంగ్‌పేట్: తెలంగాణ అసెంబ్లీ వద్ద మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తూ బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అసెంబ్లీ వద్ద ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని, ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల జరిగిన తీరు అత్యంత బాధాకరమని వారు ఆరోపించారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల కనీస గౌరవం లేకుండా వ్యవహరించడం కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ప్రతిపక్షాల బాధ్యత అని, ప్రతిపక్షాల గొంతును అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు. సబితా ఇంద్రారెడ్డితో పాటు ప్రతిపక్ష మహిళా ఎమ్మెల్యేల పట్ల జరిగిన వ్యవహారానికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 7 Sept 2026 | 07:08 PM IST
Tags: