హైదరాబాద్: గణేష్ ఆగమన్ ఊరేగింపు సందర్భంగా సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ సిబ్బంది వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి (BGUS) ప్రతినిధి బృందం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్‌ను  కలిసింది. సెప్టెంబర్ 4వ తేదీన జరిగిన ఆగమన్ ఊరేగింపులో ఉత్సవ సమితి వైస్ ప్రెసిడెంట్ శ్రీ గోవింద్ రాఠీ పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా, భౌతిక దాడికి పాల్పడటం అత్యంత అభ్యంతరకరమని పేర్కొంటూ సీపీకి ఒక అధికారిక వినతిపత్రం సమర్పించారు.

ఈ ఘటనపై పోలీస్ కమిషనర్ సానుకూలంగా స్పందించారు. దీనిపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి, తప్పు చేసిన సంబంధిత పోలీసు సిబ్బందిపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రతినిధి బృందానికి భరోసా ఇచ్చారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జరిగేలా చూడాలని, విధుల్లో ఉన్న పోలీసు అధికారులు ఉత్సవ సమితి కార్యకర్తలు, భక్తులతో సక్రమంగా సమన్వయం చేసుకుంటూ గౌరవప్రదంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా కోరారు. ఉత్సవాలు ముగిసే వరకు శాఖల మధ్య సరైన సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 6 Sept 2026 | 09:31 PM IST
Tags: