ములుగు: చారిత్రక ప్రసిద్ధి గాంచిన, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రామప్ప దేవాలయం గర్భగుడిలోని ప్రాచీన 'సోమసూత్రం' (అభిషేక జలాల మార్గం)ను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) హైదరాబాద్ బృందం విజయవంతంగా పునరుద్ధరించింది. శతాబ్దాల నాటి ఈ పురాతన కట్టడడానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా 3D మ్యాపింగ్, ఎండోస్కోపిక్ కెమెరాలు మరియు సాఫ్ట్-డ్రిల్లింగ్ వంటి అధునాతన శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి అదృశ్యమైన లేదా నిలిచిపోయిన పూడికను అధికారులు పూర్తిగా తొలగించారు.

గర్భగుడిలో స్వామివారికి నిర్వహించే అభిషేక జలాలు సక్రమంగా బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఈ సోమసూత్రం కాలక్రమేణా పూడికతో మూసుకుపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. ఏఎస్‌ఐ బృందం అత్యంత జాగ్రత్తగా చేపట్టిన ఈ పునరుద్ధరణ పనుల ద్వారా పురాతన శిల్పకళకు ఎలాంటి భంగం కలగకుండా సమస్య పరిష్కారమైంది. ఇకపై భక్తులు ఎలాంటి ఆటంకం లేకుండా శాస్త్రోక్తంగా, ఆగమశాస్త్రం ప్రకారం అభిషేకాలు నిర్వహించుకోవచ్చని దేవాలయ అధికారులు తెలిపారు. ఏఎస్‌ఐ చేపట్టిన ఈ చొరవపై చారిత్రక ప్రియులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 6 Sept 2026 | 09:21 PM IST
Tags: