హైదరాబాద్: బండ్లగూడ ఆర్టీవో ఆఫీసులో యాంటీ కరెప్షన్ బ్యూరో (ACB) అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆర్టీవో అధికారుల తీరుపై వాహనదారుల నుంచి వరుసగా ఫిర్యాదులు అందుతుండటంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగినట్లు సమాచారం. తమ వద్ద అన్ని రకాల సరైన కాగితాలు ఉన్నప్పటికీ, పనుల నిమిత్తం ఆర్టీవో కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కార్యాలయంలోని చాంబర్‌లో కానిస్టేబుల్ అరుణ్ నగదు లెక్కిస్తున్న వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఏసీబీ అధికారుల సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆర్టీవో కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ బృందం అధికారులను విచారిస్తోంది. కార్యాలయంలో గంటకు పైగా సోదాలు కొనసాగుతుండగా.. అధికారులు అక్కడి రికార్డులు, ఫైళ్లను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తనిఖీలు పూర్తిగా ముగిసిన తర్వాత పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 21 Sept 2026 | 06:37 PM IST
Tags: