శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని పెద్దగోల్కొండ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు యాపచెట్టు నవతేజ్ అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నవతేజ్ స్థానికంగా పదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం (సెప్టెంబర్ 6న) ఉదయం 6:30 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిన బాలుడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
బాలుడు అదృశ్యమైన సమయంలో లైట్ గ్రీన్ కలర్ టీషర్ట్, బ్లూ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. బంధువులు, స్నేహితులు, పరిసర ప్రాంతాల్లోని పలు చోట్ల గాలించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. నవతేజ్ ఎక్కడైనా కనిపించినా లేదా అతని ఆచూకీ గురించిన సమాచారం తెలిసినా వెంటనే 9573306032, 8187867439, 9603876990 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ కోరారు.


