ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని అన్ని రంగాల్లో బలోపేతం చేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చైతన్యపురి డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట మహేష్‌యాదవ్ ఆధ్వర్యంలో 60 మంది యువకులు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామన్న ఆయన, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువత పార్టీలో చేరడం శుభపరిణామమని అన్నారు.
చైతన్యపురి డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట మహేష్‌యాదవ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై యువత బీఆర్ఎస్లో చేరారని, ఆయన నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారని తెలిపారు. డివిజన్లో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మద్దతుతో డివిజన్‌ను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాగోలు డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, యువ నాయకుడు ముద్ద కల్యాణ్‌తో పాటుగా పార్టీలో చేరిన యువకులు తదితరులు పాల్గొన్నారు.


