యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని సహకార సంఘం (PACS) బ్యాంకు ఆవరణలో బుధవారం సీఈవో నాగరాజు ఆధ్వర్యంలో పీఏసీఎస్ సర్వసభ్య సమావేశం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీఏసీఎస్ చైర్మన్ తోటిరెడ్డి రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. వ్యవసాయ రంగంలో అన్నదాతలు ఆర్థికంగా బలపడాలంటే తీసుకున్న రుపాయలను సకాలంలో చెల్లించి, తిరిగి కొత్త రుణాలు పొందాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా చైర్మన్ తోటిరెడ్డి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరు నెలల వరకు రుణాలు చెల్లించకపోతే 7 శాతం వరకు వడ్డీ పెరిగే అవకాశం ఉంటుందని రైతులను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ప్రతికూల వాతావరణం, ఇతర కారణాల వల్ల రైతులు లోన్లు కట్టలేకపోతున్నారని, వాయిదా కోరుతున్నారని తెలిపారు. అయితే పెద్ద మొత్తంలో రుణాలు పొందిన రైతులు సకాలంలో స్పందించి బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన కోరారు.

యూరియా యాప్ సమస్యలపై స్పందన..

గ్రామీణ ప్రాంతాల్లో 'యూరియా యాప్' సాంకేతిక లోపాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చైర్మన్ తెలిపారు. స్థానిక రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, సులువుగా ఎరువులు అందేలా ఈ సమస్యను ప్రభుత్వ, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని భరోసా కంచారు. అంతేకాకుండా, రైతుల సౌకర్యార్థం 'ఈ-సేవ' కేంద్రం తరహాలో మాల్‌లో నూతన బ్యాంకు శాఖను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ఈ సందర్భంగా వివరించారు.

ఈ సర్వసభ్య సమావేశంలో లోన్ల రికవరీ అధికారి మనోజ్ కుమార్, డైరెక్టర్లు మల్లారెడ్డి, కొండాపురం కలమ్మ, మక్కపల్లి స్వరూప, మధుకర్ రెడ్డి, సర్పంచ్ డేరంగుల శంకర్, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొని చర్చించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 30 Sept 2026 | 08:31 PM IST
Tags: