వెబ్ డెస్క్: మొబైల్ రీచార్జ్ భారంగా మారుతున్న నేటి కాలంలో టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వినియోగదారులకు ఊరటనిచ్చే కొత్త మొబైల్ రీచార్జ్ రూల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది
ట్రాయ్ నిబంధనల ప్రకారం, రిలయన్స్ జియో, వొడాఫోన్, భారతీ ఎయిర్టెల్ సంస్థలు ప్రస్తుతం అందిస్తున్న బండిల్డ్ ప్లాన్స్‌కు అనుబంధంగా అదే కేటగిరీలో వాయిస్, ఎస్ఎంఎస్ ఓన్లీ ప్లాన్స్‌ను అంతకంటే తక్కువ ధరకు అందించాల్సి ఉంటుంది. ఒకసారి రీచార్జ్ చేసుకున్నాక మరుసటి నెలలో అదే రోజు రీచార్జ్ చేసుకునేలా వ్యాలిడిటీ ఉండాలని పేర్కొంది. అంటే వ్యాలిడిటీని క్యాలెండర్ నెలకు మార్చారు. గతంలో 28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్స్ ఉండేవి. దీంతో, యూజర్లు ఏడాదిలో పన్నెండు నెలలకు గాను 13 సార్లు రీచార్జ్ చేసుకోవాల్సి వచ్చేది. తాజాగా వ్యాలిడిటీని క్యాలెండర్ నెలకు పొడిగించడంతో ఏటా ఒక రీచార్జ్ భారం తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు.
మొబైల్ డేటా అవసరం లేని వారికి ఈ మార్పులు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని పరిశీలకులు చెబుతున్నారు. ఇలాంటి వారు ఇకపై కేవలం వాయిస్, ఎస్ఎంఎస్కు మాత్రమే ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. అవసరమునుకుంటేనే డేటాతో కూడిన ప్లాన్స్‌ను లేదా ప్రత్యేకంగా డేటా రీచార్జ్ ప్యాక్స్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. రీచార్జ్ వ్యాలిడిటీ క్యాలెండర్ నెలకు పెరగడంతో ఖర్చులపై కూడా మెరుగైన నియంత్రణ ఉండే అవకాశం యూజర్లకు లభిస్తుంది.


