న్యూఢిల్లీ: తెలంగాణలో లోకల్ రిజర్వేషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు మరోసారి స్పష్టతనిచ్చింది. తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల రూల్ తప్పనిసరి అని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే స్థానిక రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే అని పేర్కొంది. గతంలో జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల విద్యాభ్యాసం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అంకిత వేసిన పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది.

ఈ నిబంధన ఏకపక్షంగా ఉందన్న వాదనను జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం కొట్టివేసింది. ఎంబీబీఎస్‌ అర్హత పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులకే స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోను సుప్రీం ధర్మాసనం మరోమారు సమర్థించింది.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 28 Sept 2026 | 03:39 PM IST
Tags: