మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మన్సాన్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పింఛన్ల లబ్ధిదారుల వివరాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా గురువారం గ్రామంలో విస్తృతంగా పెన్షన్ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు. మహేశ్వరం ఎంపీడీఓ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారులు నేరుగా గ్రామానికి చేరుకుని, అర్హులైన పెన్షన్ లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న వివిధ రకాల సామాజిక భద్రతా పింఛన్లు అర్హులైన పేదలకు ఎక్కడా ఎలాంటి అంతరాయం లేకుండా సక్రమంగా అందుతున్నాయా లేదా అనే కోణంలో ఈ తనిఖీలు చేపట్టారు. వెరిఫికేషన్‌లో భాగంగా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల అర్హత ప్రమాణాలు, వ్యక్తిగత సమాచారం, ఆధార్ తదితర సంబంధిత ధ్రువపత్రాలను అధికారులు క్లారిటీగా పరిశీలించారు. లబ్ధిదారుల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించి, ప్రభుత్వ రికార్డులతో సరిపోల్చి తగిన వివరాలను నమోదు చేసుకున్నారు.

అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా అందాలనే ఉద్దేశంతోనే ఈ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం ఎంపీడీఓతో పాటు పలువురు పంచాయతీ అధికారులు, సచివాలయ సిబ్బంది మరియు గ్రామపంచాయతీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 24 Sept 2026 | 07:09 PM IST
Tags: